Hyundai: కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ రికార్డ్ సేల్స్‌తో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభమైన తర్వాత ఈ సెప్టెంబర్ లోనే రికార్డు అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో కార్ల అమ్మకాల్లో పెరుగుదల ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీకి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎస్‌యూవీ పోర్టుఫోలియోలో ఎక్స్‌టర్, వెన్యూ, క్రేటా, అల్కజర్, టక్సన్ కార్ మోడల్స్ ఉన్నాయి.