Rajasthan: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడి ఘటన మరవక ముందే, రాజస్థాన్‌లో కారులో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్‌తో నిండిన ఒక మారుతి సియాజ్ కారును బుధవారం రాజస్థాన్‌లోని టోంక్‌లో గుర్తించారు.