లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు, సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్, ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య, దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.