ఖమ్మం జిల్లాగా పాలేరు నియోజకవర్గాన్ని చూశానన్నారు టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. కులమతాలకు, పార్టీల అతీతంగా అభివృద్ధికి కృషి చేశానన్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొంది మీ నియోజకవర్గం లోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశా అన్నారు తుమ్మల. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలను అభివృద్ధి చేశానన్నారు. నలభై సంవత్సరాలుగా…