రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లాలోని ఆలూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యే లు దౌర్జనానికి పాలుపడుతున్నారని ఆయన అన్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ జరిగినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోరని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రెండునరేళ్ళలో అన్ని వర్గాల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన…