సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు ఢిల్లీలో మౌన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రామాలు మానేయ్ అంటూ ఆయన మాట్లాడారు. భీమ్ దీక్ష అని పెట్టి అందులో…
కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై ధ్వజమెత్తారు. రవీందర్ సింగ్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. రవీందర్ సింగ్ అవకాశవాద రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడన్నారు సునీల్ రావు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా అంశం ఆయన నైతికతకే వదిలేస్తున్నాం. గత సంవత్సర కాలంగా 2023లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నది నిజం కాదా? ఏ ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో అవకాశం కావాలి అనడం అత్యాశ.…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా, కరీంనగర్ మాజీ మేయర్, 51 డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు… ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు రవిందర్ సింగ్… టీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో ఆరోపించారు మాజీ మేయర్.. కాగా, స్థానిక…