ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గత శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో నేడు ఆయనను సీఐడీ తమ ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు సీఐడీ అధికారులు ముందు హజరుకావల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
ఏపీలో సంచలనం కలిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాు.ఈ స్కాంలో సీఐడీ విచారణ లోతుగా కొనసాగిస్తోంది. రూ.242 కోట్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. డిజైన్ టెక్ కి తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని పూణే సంస్థలు స్పష్టం చేశాయని…
మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మీనారాయణ పనిచేశారు. తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.…