ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఈక్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని, వాళ్ళ కదలికలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగ్స్ పెట్టడం, వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవాల్సిన పరిణామాలంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బాగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల. కానీ... ఇక్కడ ఇప్పటికీ టీడీపీ ఇన్ఛార్జ్ లేరు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి గెలవగా... ఏడాదిన్నర కావస్తున్నా... ఇంతవరకు తమ గోడు వినే నాధుడు కరవయ్యాడని ఆవేదన పడుతున్నారు తమ్ముళ్ళు. టీడీపీకి దశాబ్దాలుగా సేవలందించిన చాలా మంది ఇన్ఛార్జ్ పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నా... అధిష్టానం మాత్రం కిమ్మనడంలేదట.
ఓ ఐదేళ్ల క్రితం అక్కడ ఫ్లై ఓవర్ వస్తుందంటే అందరూ గగ్గోలు పెట్టారు.అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకోవడంతో ఫ్లై ఓవర్ కాస్తా బైపాస్ గా మారింది. కట్ చేస్తే మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. ఇదే స్థానిక అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోయారట. ఇంతకీ ఎచ్చెర్ల వైసీపీ నేతల్లో బైపాస్ కలవరానికి కారణమేంటి ? శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో ఇప్పుడు రాజకీయమంతా బైపాస్…