Elon Musk-Twitter Deal Details: ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేయటం వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ సామాజిక మాధ్యమాన్ని తాను డబ్బు సంపాదన కోసం సొంతం చేసుకోలేదని కొత్త యజమాని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగానే అనిపించింది. ఎందుకంటే.. ట్విట్టర్‌ను తన వ్యాపార సామ్రాజ్యంలో కలుపుకునేందుకు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.