UGC New Rules 2026: యూనివర్సిటీల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు తమ కులం కారణంగా అవమానాలు, వివక్షను ఎదుర్కొన్న ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ నిబంధనలను తీసుకొచ్చింది. జనవరి 13న, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026ను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో తప్పనిసరిగా ఈక్వల్ అపర్చునిటీ సెంటర్ ఏర్పాటు…