హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్‌లో…
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా.. బొల్లారంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌పై దాడి చేసి.. ఫ్లాట్ నుంచి 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కింగ్ పిన్ శివ రామకృష్ణ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబు అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన ఎం. ప్రసాద్…