DRUGS: హైదరాబాద్‌లో మరోసారి భారీగా మత్తు పదార్థాల ఉత్పత్తి
- భారీగా ఎఫెడ్రిన్ మత్తు పదార్థం స్వాధీనం
- నిందితులను వాస్తవయి శివరామకృష్ణ పరమవర్మ
- డాంగేటి అనిల్, ముసిని దోరబాబు
- మద్దు వెంకట కృష్ణరావుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నట్లు బయట పడింది. హైదరాబాద్ జీడిమెట్ల అంతా పారిశ్రామిక ప్రాంతం. అక్కడ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో కొంత మంది ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ ఉత్పత్తి స్టార్ట్ చేశారు. కానీ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి.. భారీగా ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డ్రగ్ తయారీదారులను అరెస్ట్ చేశారు. వారిని వాస్తవయి శివరామకృష్ణ పరమవర్మ, డాంగేటి అనిల్, ముసిని దోరబాబు, మద్దు వెంకట కృష్ణరావుగా గుర్తించారు..జీడిమెట్లలోని సాయి దత్త రెసిడెన్సీ, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో దాడి చేశారు ఈగల్ టీమ్ అధికారులు. డ్రగ్ తయారీ ముఠా నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ దేశీయ మార్కెట్లో రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
ఈ కేసులో అరెస్టయిన వాస్తవయి శివరామకృష్ణ పరమవర్మ.. కాకినాడకు చెందిన వ్యక్తి. ఆక్వా కల్చర్ వ్యాపారిగా ఉన్నారు. మరో నిందితుడు డాంగేటి అనిల్ కూడా కాకినాడకు చెందిన వ్యక్తి. జీడిమెట్లలోని పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్నాడు. అటు మరో నిందితుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముసిని దోరబాబు.. జీడిమెట్లలోని విఘ్నసాయి ల్యాబొరేటరీస్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకట కృష్ణరావు పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అదే కంపెనీకి చెంది మరో డైరెక్టర్ ప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఈగల్ టీమ్ పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శివరామకృష్ణ పరమవర్మ గతంలో 2 సార్లు డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2017లో బెంగళూరులో, 2019లో హైదరాబాద్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో 250 కిలోల యాంఫిటమైన్, 10 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇక డాంగేటి అనిల్, దోరబాబు, వెంకట కృష్ణరావు, ప్రసాద్‌కు రసాయన పరిశ్రమల్లో పని చేస్తూ మత్తు పదార్థాల తయారీకి కావలసిన రసాయన పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. స్పాట్…
2024 డిసెంబర్‌లో శివరామకృష్ణ పరమవర్మ, అనిల్‌ను పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో కలిశాడు. అనంతరం ఇద్దరూ మద్యం షాప్ వద్ద సమావేశమై ఎఫెడ్రిన్ తయారీపై చర్చించారు. అనిల్ సూచన మేరకు కంపెనీ యజమానులు వెంకట కృష్ణరావు, ప్రసాద్‌ను ఈ పనిలోకి లాగారు. శివరామకృష్ణ రూ.8 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసి, టోలోయిన్, బ్రోమిన్, అసిటోన్ వంటి రసాయనాలు సరఫరా చేశాడు. అనిల్ మరిన్ని రా మెటీరియల్ కొనుగోలు చేసి తయారీ ప్రారంభించాడు. మూడవ దశ ప్రాసెసింగ్ తర్వాత 220 కిలోల ఎఫెడ్రిన్ సిద్ధమైంది. ఈ డ్రగ్‌ను జీడిమెట్లలోని సాయి దత్త రెసిడెన్సీలో దాచిపెట్టారు. నిందితుల కదలికలపై ఈగిల్ బృందం గమనిస్తుండగా.. అక్టోబర్ 9న వారు ఒకే చోట సమావేశమయ్యారు. దాంతో సిబ్బంది దాడి చేసి ఒకేసారి నలుగురిని అరెస్ట్ చేశారు. ఫ్లాట్‌లో 220 కిలోల అధిక నాణ్యత గల ఎఫెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు డ్రగ్ తయారీలో ఉపయోగించిన పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ యూనిట్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ సంస్థకు లీజ్ పత్రాలు, బోర్డు మీటింగ్ మినిట్స్, బ్యాంకు లావాదేవీలు లాంటి రికార్డులు లేవని విచారణలో తేలింది…
ఎఫెడ్రిన్ అత్యంత వ్యసనపరమైన మత్తు పదార్థమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని తరచుగా వాడితే ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి, వాంతులు, ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని నుంచి తయారయ్యే మెతాంఫిటమైన్ ధర 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!