ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్పస్ పాక్షిక ఉపసంహరణకు నిబంధనలను సడలించింది. అదే సమయంలో 25% “కనీస బ్యాలెన్స్”గా ఉంచాలని తెలిపింది. తద్వారా ఏడు కోట్లకు పైగా చందాదారులు గణనీయమైన పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించుకోవచ్చు. వారి పని జీవితంలో చక్రవడ్డీ రాబడిని పొందవచ్చు. “పాక్షిక ఉపసంహరణల సరళీకరణ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపులు లేదా పెన్షన్ అర్హతలను రాజీ పడకుండా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలరని నిర్ధారిస్తుంది” అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది.…