కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బేసిక్ శాలరీ లిమిట్ 15 వేలు ఉండగా.. ప్రస్తుతం 25వేలకు పెంచే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్ ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీంతో కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారు.…