విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈఓ సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు విచారణ కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. నోట్ ఫైల్, ఎమ్ బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఫాలో అయ్యారా? అనే ప్రశ్నలకు అధికారులు…