ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ శుక్రవారం రాత్రి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 25 బంతుల్లోనే ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ భారత జట్టు 5 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు తుఫాను ఆరంభం…