సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై…
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం యశస్వి ముందుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ 97 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం 20 టెస్టుల్లో (38 ఇన్నింగ్స్‌లు) 1903 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు…
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై…
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్…
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. టీమిండియా ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మ్యాచ్ మూడో రోజైన ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్‌లను మనోళ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా గత ఐదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ప్రస్తుతం టీమ్ మొత్తం యువ ఆటగాళ్లతో ఉందని,…
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనలో శక్తి ఉన్నంతవరకూ క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు. ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ తర్వాత విషయాలు దేవుడికి వదిలేస్తాను అని తెలిపాడు. తన గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేనని బుమ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆట అనంతరం బుమ్రా మాట్లాడాడు. అంతర్జాతీయ…
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84 రోజుల అనంతరం, 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. ఎమ్రిట్ 396 మ్యాచ్‌ల (10 ఏళ్ల 337 రోజులు) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్…
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓ ఓవర్లో ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడని, ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం అని డకెట్ ప్రశంసించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 465 పరుగులకు…
ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.