ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియాలి ఇది కొత్త శకం. ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలిచి 18 ఏళ్లు అవుతుంది అంటే.. అక్కడ జట్టును నడిపించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఇంగ్లీష్ గడ్డపై పర్యటిస్తున్నా.. అక్కడ మూడుసార్లు మాత్రమే భారత్ టెస్టు సిరీస్ గెలిచింది.…
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లెజెండరీ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పోల్చాడు. తన బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో ఎక్కువగా ఉందన్నాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ వేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందన్నాడు. బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ…