Smart Phones: ఇండియన్స్ సహజంగా రెండేళ్లకోసారి స్మార్ట్‌ఫోన్ మారుస్తుంటారు. కిందపడి పగిలిపోవటం వల్ల గానీ.. పాతబడి సరిగా పనిచేయకపోవటం వల్ల గానీ.. వాడుతున్న ఫోన్‌ను పక్కన పెట్టి కొత్తది కొంటుంటారు. కానీ.. ఇప్పుడు.. అలా.. ఈజీగా కొత్త ఫోన్ కొందామంటే ప్రజల దగ్గర పైసల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ద్రవ్యోల్బణం వల్ల ఇండియాలో తక్కువ రేటు స్మార్ట్‌ఫోన్లకి డిమాండ్ పడిపోయింది.