మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్థంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీరభూమిలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. వీరితో పాటు నేతలు పి.చిదంబరం, సచిన్ పైలట్ కూడా మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే.. రాజీవ్ గాంధీ వర్థంతి నేపథ్యంలో ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మా నాన్న దూరదృష్టి గల నాయకుడు.. ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. అతను కరుణ…