బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ఇది సంభవించిన వెంటనే చికిత్స అందించకపోతే, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ప్రాణాంతక పరిస్థితిని ముందుగానే అరికట్టేందుకు స్విస్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. రక్తనాళాల్లో ప్రయాణిస్తూ మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని గుర్తించి తొలగించే మైక్రో రోబోట్లను వారు అభివృద్ధి చేశారు. ఈ మైక్రో రోబోట్లను చేతి భాగం లేదా తొడ ప్రాంతం ద్వారా చిన్న సూదితో రక్తనాళాల్లోకి పంపుతారు. రక్తప్రవాహంతో…