అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు నా బాధ అన్నట్టుగా ఉందట ఆ ఎమ్మెల్యే వ్యవహారం. సిట్టింగ్‌నైనా పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు బాధ లేదుగానీ… కొత్త అభ్యర్థి పూచిక పుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అంటున్నారాయన. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏం చేశారాయన? చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా…. ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జంప్…