ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం వుంది. కానీ అప్పుడే వేడి మరింతగా రాజుకుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్‌లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి…