గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. గత జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర…
రిటైల్లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది.. రిటైల్‌లో ఒక్క గుడ్డును ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.. ఇక, టోకుగా 100 గుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది.. అంటే హోల్ సెల్‌లో ఒక గుడ్డు ధర రూ.5.80 పలుకుతుండగా.. అదే రిటైల్‌కి వచ్చే సరికి సరాసరి రూ.1.20 పెంచేసి.. రూ.7కు విక్రయాలు సాగిస్తున్నారు.