Egg Price: రోజుకో కోడి గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతుంటారు.. అందుకే కిచెన్‌లో కోడి గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. రోజువారీ ఆహారంలో గుడ్డు.. కచ్చితంగా గుడ్లు తినడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాన్ని అస్సలు మరిచపోవద్దు. ఉడికించిన గుడ్లని తినడం మంచిది. గుడ్లలో ఎన్నో పోషకాలు, గుడ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.. గుడ్లు పోషకాలకి స్టోర్ హౌజ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1. 6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నమాట.. అయితే, కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది.. విశాఖలో ఆల్‌టైం హై రికార్డు స్థాయికి చేరింది.
Read Also: Astrology: డిసెంబర్ 12, మంగళవారం దినఫలాలు
నిన్నటి వరకు కార్తిక మాసంతో.. నాన్‌వెజ్‌తో పాటు గుడ్లకు కూడా కొంతమంది దూరంగా ఉంటూ వచ్చారు.. అయితే, కార్తిక మాసం ముగింపు, క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్‌తో గుడ్డు ధర పైపైకి కదులుతోంది.. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది.. రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డును ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.. ఇక, టోకుగా 100 గుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది.. అంటే హోల్ సెల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.5.80 పలుకుతుండగా.. అదే రిటైల్ మార్కెట్‌కి వచ్చే సరికి సరాసరి రూ.1.20 పెంచేసి.. రూ.7కు విక్రయాలు సాగిస్తున్నారు. స్థానికంగానే కాకుండా.. పశ్చిమ బెంగాల్, నార్త్ ఇండియా నుంచి కూడా కోడి గుడ్లకు డిమాండ్ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.