దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు…