తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’…
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన.…