‘బాలు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను పోషించిన మాస్టర్ అభినవ్ మణికంఠ యాభైకు పైగా చిత్రాలలో బాల నటుడి పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఏడేనిమిదేళ్ళు పనిచేసిన దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వంలో గుజ్జా యుగంధర్ రావు నిర్మిస్తున్న సినిమాతో అభినమ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఏడ తానున్నాడో’ అనే పేరు…