ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విడుదలపై స్టే విధించాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. బెయిల్ వచ్చిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.
Praful Patel : ప్రఫుల్ పటేల్‌కు పెద్ద ఊరటనిస్తూ రూ. 180 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉత్తర్వులను ముంబై కోర్టు రద్దు చేసింది. స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మానిప్యులేషన్ చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో లభించిన రెగ్యులర్ బెయిల్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈనెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.