ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు…
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.