Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది.…