ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభం కాకినాడ జిల్లా లో జరుగనుంది. అయితే, తాజాగా సామర్లకోటలో ఈటీసీ లే అవుట్‌లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 12వ తారీఖున వెళ్లనున్నారు.