Nepal: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉంది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించింది.
నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 6 మంది చనిపోయారు. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.