కొన్ని కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి, విజయాలనూ సొంతం చేసుకుంటాయి. కానీ, ఎందుకనో రిపీట్ కావు. అదే విచిత్రంగా ఉంటుంది. చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలు సాధారణమే అనుకోవాలి. హీరో వెంకటేశ్ తో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అలాంటి చిత్రమైన పరిస్థితినే చూశారు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యులద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. అయితే వెంకటేశ్ సొంత సంస్థ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయనను డైరెక్ట్ చేయలేకపోయానని ఇ.వి.వి. సత్యనారాయణ అంటూ ఉండేవారు. వెంకటేశ్, ఇ.వి.వి.…