సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్ చలాన్‌లకు సంబంధించిన ఈ-చలాన్‌ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్‌ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.