విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన “నారప్ప” ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం దగ్గుబాటి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని ఆశించిన వెంకీమామ అభిమానులకు అలా నిరాశ తప్పలేదు. తాజాగా మరోమారు వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. “దృశ్యం” చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న…
వెంకటేష్ దగ్గుబాటి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్‌లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా పోషించగల అరుదైన నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పుడు 2014 ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ “దృశ్యం” సీక్వెల్‌గా రాబోతున్న మూవీ “దృశ్యం 2″తో ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! వెంకటేష్ ఈ…
ఇటీవలే ‘నారప్ప’ ను ఓటీటీలోకి తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ‘దృశ్యం 2’ విడుదలపై దృష్టిపెట్టారు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే వస్తుందని.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం మేరకు దృశ్యం 2 థియేటర్లోకి రానుందని తెలుస్తోంది. ఈమేరకు ఓటీటీ డీల్ ను బ్రేక్ చేసారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.…
విక్టరీ వెంకటేష్-ప్రియమణి జంటగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. కాగా, అగ్ర నిర్మాత అయినటు వంటి సురేష్‌బాబు ఈ సినిమాను ఓటీటీ బాట తీసుకెళ్లడంతో ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. ఇక దృశ్యం 2, విరాట పర్వం సినిమాలు కూడా…
విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. ఈ సినిమాలో వెంకటేష్ సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను వెంకటేష్ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, కరోనా మహమ్మారి కారణంగా దృశ్యం 2 మలయాళ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు…