ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఓ మహిళ హంగామా సృష్టించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుల్లలచెరువు రోడ్డుపై మద్యం సేవించిన ఆమె, “క్వార్టర్ మందు కావాలి” అంటూ ఆర్టీసీ బస్సును అడ్డగించి రోడ్డుపై కూర్చుంది. క్వార్టర్ మందు ఇప్పించకపోతే బస్సును ముందుకు కదలనివ్వనని మొండికేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ బస్సు ముందు కూర్చుని అరుస్తూ, హల్‌చల్ చేయడంతో దాదాపు అరగంట పాటు బస్సు అక్కడే…