భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి. చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి.