Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు…