Drone Missile: భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెస్ట్ సెంటర్‌లో డ్రోన్ నుంచి ప్రిసెషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలులో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను నిర్వహించింది.