డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్‌లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.