Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ విచిత్రమైన పరిస్థితిని ఎదర్కొన్నారు. అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయ్యారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే కూడా రిషి సునాక్‌తో కాసేపు బయటే ఉన్నారు. అక్కడ ఉన్న మీడియా అంతా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌గా మారింది. రిషి సునాక్, డచ్ ప్రధాని మార్క్ రొట్టేను అధికార నివాసం వెలుపల స్వాగతిస్తూ, మీడియాకు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.