KTR: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి.