US President’s Salary: అగ్రరాజ్యాధినేతగా, నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న యూఎస్ ప్రెసిండెట్ డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా.. అక్షరాల ఏడాదికి 4 లక్షల డాలర్లు. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.3.36 కోట్లు. అంటే అమెరికా అధ్యక్షుడు నెలకు సుమారు రు.28 లక్షల వేతనం తీసుకుంటారు. ఆయనకు వేతనం మాత్రమే కాదండోయ్ ఖర్చులకు, ప్రయాణాలకు, వినోదానికి కూడా డబ్బులు చెల్లిస్తారు. అధ్యక్షుడు ఖర్చుల కోసం అదనంగా మరో 50 వేల డాలర్లు, ప్రయాణ…