Rashmi Gautam : కార్లలో తిరిగే నీకేం తెలుసు వీధి కుక్కల గురించి.. రష్మిని ఏకేస్తున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెలుసు. ఇదే కొన్ని సార్లు రష్మిని ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం వీధికుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అయితే దీని ప్రభావం ఇప్పుడు యాంకర్ రష్మిపై పడింది. జబర్దస్త్ యాంకర్ రష్మి.. ముఖ్యంగా కుక్కల విషయంలో ఆమె ఎక్కువగా కేర్ తీసుకున్నారు. నిత్యం ఏదో ఒక సంఘటనని సోషల్ మీడియాలో పంచుకుంటూ కుక్కలను, లేదంటే ఏదైనా జంతువులను కాపాడాలని పోస్ట్ చేస్తుంటుంది.
Read Also:Vizag: బీచ్‌లో దారుణం.. అర్ధరాత్రి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఎవరైనా ఏ యానిమల్‌ని హింసించినా తట్టుకోదు, తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో చిన్నారిని కుక్కలు కరిచి చంపిన నేపథ్యంలో దాన్ని ట్యాగ్ చేస్తూ దీనికి ఏం సమాధానం చెబుతారని రష్మిని నిలదీస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి, ఈ న్యూస్ చూశారా మేడం. మీరుజంతు ప్రేమకులు కాదనడం లేదు, నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏం తెలుస్తుంది. వీధి కుక్కల కోసం మీకు డబ్బు ఉంది. బాబు వాళ్ల నాన్న రోడ్ పైన చెవి రింగులు అమ్ముకుంటాడు` అని ఓ నెటిజన్ పోస్ట్ పెడితే, `ఒక సినిమా పోతేనే తట్టుకోలేని మీరు అక్కడ ఒక బాబు ప్రాణం పోతే వాళ్ల అమ్మనాన్నలు ఎలా తట్టుకుంటారు. దయజేసి వాళ్లకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయండి. మీరు పెంపుడు కుక్కల మధ్య పెరుగుతారు. సాధారణ జనం వీధికుక్కల మధ్య పెరుగుతారు` అంటూ మరో నెటిజన్లు పోస్ట్ చేశారు.
Read Also:Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్
దీనిపై రష్మి గౌతమ్ రియాక్ట్ అయ్యింది. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నన్ను ట్యాగ్ చేయడం, ఈ విషయాలను నన్ను అడగడం వల్ల ఎలాంటి సహాయం రాదు, నేను ప్రభుత్వం కాదు, నిధులుజారీ చేయను, ఆ నిధులను తినను. నిజానికి నేను చేయగలిగినంత కుక్కలకు క్రిమిరహితం చేయడానికి వ్యక్తిగత డబ్బుని ఉపయోగిస్తున్నా అని తెలిపింది. మరో ప్రశ్నికి చెబుతూ, మీరు తప్పుగా ట్యాగ్ చేశారని, దీనికి ప్రభుత్వానికి ట్యాగ్ చేయాలని, చట్టవిరుద్ధమైన పెంపకంపై కఠినమైన చర్యలు తీసుకోండి. ప్రత్యక్ష పెంపుడు జంతువుల అమ్మకం, కొనుగోలుని నిషేధించండి. మన కుక్కలను దత్తత తీసుకోవచ్చు, వాటిని రోడ్లపై లేకుండా చేయవచ్చు` అని తెలిపింది రష్మి. దీంతో ప్రస్తుతం రష్మి కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక యాంకర్ రష్మి ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి ఆమె యాంకర్‌గా చేస్తుంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?