తెలంగాణాలో వీధికుక్కలు జనాలను వణికిస్తున్నాయి.. పిల్లలను బయటకు పంపాలంటే జంకుతున్నారు.. వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.. వీధికుక్కలు దాడుల్లో పలువురు మరణిస్తే మరికొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు. అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా హన్మకొండలో వీధికుక్కల దాడికి మరో బాలుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు ఆడుకుంటున్న ఆ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పిల్లలు కళ్ల ముందే చనిపోవడం కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటుతున్నాయి..
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో జూన్ 17న ఓ బాలుడు ఆడుకుంటుండగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయ పడ్డాడు. దీనితో బాలుడిని ఎంజిఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొదట బాలుడు కొంత కోలుకున్నప్పటికీ.. ఆ తరువాత వింతగా ప్రవర్తిస్తూ చనిపోయాడు. బాలుని మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. కొన్ని రోజుల క్రితం కూడా హన్మకొండ జిల్లా కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్ సమీపంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా చోటు అనే బాలునిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 8 ఏళ్ల బాలునికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కుక్కలు దాడి చేస్తున్న ఘటనను చూసిన స్థానికులు బాలుడిని హుటాహుటీన ఆసుపత్రి కి తరలించారు.. అప్పటికే కుక్కలు తీవ్రంగా గాయపరిచడంతో మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు.. కొన్ని నెలల కిందట హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధికుక్కలు బాలుడిని చంపేశాయి. దీనితో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటించిన జీహెచ్ఎంసీ కుక్కల నివారణ కోసం చర్యలు చేపట్టింది. ఇక తాజాగా హన్మకొండలో బాలుడు మృతి తో అధికారులు అలెర్ట్ అయ్యారు..కుక్కల వేటను మొదలు పెట్టారు.. మరో ప్రాణం పోకుండా చూస్తామని హామీలు ఇస్తున్నారు..