అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది.