ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లలో కోరాయి.
బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు.