ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు. Read Also…