Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. "ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్‌సీబీ…
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.